సూసైడ్​ వీడియో కలకలం.. భూమి ఆక్రమిస్తున్నారని భార్యభర్తల ఆత్మహత్యాయత్నం..

సూసైడ్​ వీడియో కలకలం.. భూమి ఆక్రమిస్తున్నారని భార్యభర్తల ఆత్మహత్యాయత్నం..

భార్యకు వారసత్వంగా సంక్రమించిన భూమిని గ్రామానికి చెందిన కొందరు ఆక్రమిస్తున్నారని దంపతులు ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాలలో కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నర్మెట్ట మండలం సూర్యబండ తండాకు చెందిన గురు, సునీత భార్యభర్తలు. 

గ్రామంలోని భుక్య జయరాం, భుక్య సురేందర్, భుక్య శ్రీనులతో దంపతులకు 1.09 ఎకరాల భూమి విషయంలో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో దంపతులిద్దరూ ఇప్పటికే పలు మార్లు పోలీస్​కంప్లెంట్​చేశారు. 

విచారణ నడుస్తుండగానే ప్రత్యర్థులు  పొలంలో జేసీబీలతో చదును చేస్తూ ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారు. తీవ్ర ఆవేదనకు గురైన భార్యభర్తలు ఆగస్టు12న సెల్ఫీ వీడియో తీసుకుంటూ భూఆక్రమణకు పాల్పడిన వారి వివరాలు వెల్లడించారు. 

సూసైడ్ నోట్​ని రాసి తాము మరణిస్తే భూమి ఎవరికి చెందాలనే వివరాలను అందులో పొందుపరిచారు. అనంతరం పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. స్థానికులు గమనించి వారిని దగ్గర్లోనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

ప్రస్తుతం బాధితులు అక్కడ చికిత్స పొందుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.