- గవర్నమెంట్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్
హనుమకొండ సిటీ, వెలుగు : ఈ నెల 8న కాజీపేట వ్యాగన్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ప్రధాని మోడీ వస్తున్న సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్‌రెడ్డి వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా కేఎంసీ హాస్పిటల్, జైనీస్ గ్రౌండ్‌లోని సింథటిక్ ట్రాక్, భద్రకాళి బండ్, నగరంలోని వివిధ జంక్షన్లు, వరంగల్ రైల్వే స్టేషన్ వద్ద ‘సెల్ఫీ విత్ మోదీ గవర్నమెంట్ డెవలప్‌మెంట్’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
సందర్భంగా రాకేశ్‌రెడ్డి మాట్లాడుతూ వరంగల్ అభివృద్ధికి కేంద్రం ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిందని చెప్పారు. స్మార్ట్, అమృత్, హృదయ్ సిటీ పథకాలు మంజూరు అయిన అరుదైన ఘనత వరంగల్‌కే దక్కుతుందన్నారు. మోదీ బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు సందీప్‌రెడ్డి, కొమురయ్య, రవీందర్, సతీశ్, శివరాం, రమేశ్, భాస్కర్ పాల్గొన్నారు.