సీట్​ బెల్ట్ పెట్టుకోక 75% మంది చనిపోతున్నరు : టీజీపీడబ్ల్యూయూ అధ్యక్షుడు సలావుద్దీన్​

సీట్​ బెల్ట్ పెట్టుకోక 75% మంది చనిపోతున్నరు : టీజీపీడబ్ల్యూయూ అధ్యక్షుడు సలావుద్దీన్​
  • 2022లో 16,715 మంది ప్రాణాలు కోల్పోయారు 
  • సెల్ఫీ విత్‌‌ సీట్​ బెల్డ్​ చాలెంజ్ ప్రారంభం

హైదరాబాద్​సిటీ, వెలుగు:  రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడానికి తెలంగాణ గిగ్ అండ్​ప్లాట్‌‌ఫామ్​వర్కర్స్ యూనియన్(టీజీపీడబ్ల్యూయూ) అధ్యక్షుడు షేక్​సలావుద్దీన్ ఆధ్వర్యంలో శుక్రవారం ‘సెల్ఫీ విత్‌‌ సీట్​బెల్డ్​చాలెంజ్’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సీట్​బెల్ట్​పెట్టుకుంటే రోడ్డు ప్రమాదాల్లో జరిగినప్పుడు 60 శాతం వరకు ప్రాణాలను రక్షించుకోవచ్చని, డ్రైవర్లే కాకుండా ప్రయాణికులు కూడా సీట్​బెల్డ్​పెట్టుకోవాలని సలావుద్దీన్​సూచించారు.

2016లో ప్రారంభించిన ఈ ఛాలెంజ్​దేశ వ్యాప్తంగా ఫేమస్​అయ్యిందని పేర్కొన్నారు. ప్రభుత్వ నివేదిక ప్రకారం దేశంలో 2022లో సీట్​బెల్ట్​పెట్టుకోకపోవడం వల్ల 16,715 మంది ప్రాణాలు కోల్పోయారని, ఇందులో 8,384 మంది డ్రైవర్లు, 8,331 మంది ప్రయాణికులు ఉన్నారన్నారు. నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ 2016లో నిర్వహించిన సర్వే ప్రకారం 75 శాతం మంది సీట్​బెల్ట్ పెట్టుకోకపోవడం వల్ల చనిపోతున్నారని చెప్పారు.

సెల్ఫీ విత్‌‌ సీట్​బెల్ట్ వంటి కార్యక్రమాలతో జనంలో అవగాహన పెరిగిందని, 2023 నాటికి ముందు సీట్లలో కూర్చుని సీట్​బెల్ట్​పెట్టుకుంటున్నవారి శాతం 83కు పెరిగిందని, వెనుక సీట్లలో కూర్చుంటున్నవారిలో 30 శాతం మంది మాత్రమే సీట్​బెల్ట్​పెట్టుకుంటున్నారని, ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉందని సలావుద్దీన్​చెప్పారు.