- క్రికెట్ అభిమానులను టార్గెట్ చేసిన సైబర్ నేరగాళ్లు
- తమ వద్ద టికెట్లు ఉన్నాయంటూ పోస్టులు
- అమాయకుల నుంచి అందినకాడికి దోపిడీ
హైదరాబాద్, వెలుగు : సైబర్ నేరగాళ్లు క్రికెట్‌అభిమానులను టార్గెట్చేస్తున్నారు. ప్రస్తుతం నడుస్తున్న ఐపీఎల్ క్రేజ్‌ను క్యాష్చేసునేందుకు సరికొత్త మోసానికి తెరలేపారు. అఫీషియల్ సైట్ లో కంటే తక్కువ రేటుకు టికెట్లు ఇస్తామంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నిజమేనని నమ్మిన వారి నుంచి అందినకాడికి దోచేస్తున్నారు. ఏప్రిల్5న హైదరాబాద్ఉప్పల్స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్జరగనుంది.
గతేడాది సిటీలో సీఎస్కే మ్యాచ్జరగలేదు. రెండేళ్ల తర్వాత సిటీలో సీఎస్కే మ్యాచ్ జరుగుతుండడంతో భారీ క్రేజ్ ఏర్పడింది. ఎలాగైనా ఈసారి స్టేడియంకు వెళ్లాలని, తమ అభిమాన క్రికెటర్ధోనీ ఆటను లైవ్‌లో చూడాలని ఫ్యాన్స్ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే పేటీఎంలో పెట్టిన చెన్నై, హైదరాబాద్ మ్యాచ్టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడుపోయాయి. పేటీఎం యాప్, సైట్లో ఈ మ్యాచ్‌కు సంబంధించి సెర్చ్‌చేస్తే సోల్డ్అవుట్అని వస్తోంది.
ఈ విషయాన్ని పసిగట్టిన సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారు. ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ లో ఐపీఎల్టికెట్స్సెల్లర్పేర్లతో ప్రత్యేక అకౌంట్లు క్రియేట్చేస్తున్నారు. మ్యాచ్టికెట్లు అందుబాటులో ఉన్నాయని పోస్టు చేస్తున్నారు. స్పందించిన వారికి క్యూఆర్ కోడ్పంపించి అడ్వాన్స్‌గా రూ.1000 చెల్లించాలని సూచిస్తున్నారు. తర్వాత 30 నిమిషాలకు ఈ–మెయిల్‌కు ఈ–టికెట్స్ పంపిస్తామని ట్రాప్ చేస్తున్నారు. ఈ– టికెట్స్ వచ్చిన తర్వాత డబ్బు మొత్తం చెల్లించాలని మోసగిస్తున్నారు. ఫిజికల్ టికెట్స్ కావాలంటే 48 గంటల తరువాత స్టేడియం బయట తీసుకోవచ్చని నమ్మబలుకుతున్నారు. వలలో పడిన అమాయకుల నుంచి అందినకాడికి దోచేస్తున్నారు.
చెన్నై మ్యాచ్ టికెట్లు లేవ్
ఏప్రిల్5న ఉప్పల్ స్టేడియంలో జరిగేచెన్నై, హైదరాబాద్మ్యాచ్కు సంబంధించిన టికెట్లు ఇప్పటికే పూర్తిగా అమ్ముడుపోయాయని సైబర్క్రైమ్పోలీసులు తెలిపారు. పేటీఎం కూడా సోల్డ్అవుట్పెట్టేసిందని, సైబర్ నేరగాళ్ల పోస్టులను నమ్మొద్దని సూచిస్తున్నారు. టికెట్ల కోసం సైబర్‌నేరగాళ్లు పంపిస్తున్న క్యూ ఆర్ కోడ్ చేయొద్దని, లింక్స్ ఓపెన్ చేయొద్దని చెబుతున్నారు. ఈ మేరకు రాచకొండ సైబర్ క్రైమ్ పోలీసులు సోషల్‌మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో ప్రచారం చేస్తున్నారు. అనుమానాస్పద లింకులు, క్యూఆర్కోడ్ల ద్వారా చెల్లింపులు చేయెద్దని అప్రమత్తం చేస్తున్నారు. బాధితులు 1930 నంబర్ లేదా స్థానిక సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.