ఖమ్మం టౌన్, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్టీసీ సంస్థ పరిధిలో ఉన్న బస్టాండుల్లోని షాపుల్లో ఎక్కువ ధరలకు వస్తువులు అమ్ముతున్నవారికి అధికారులు ఫైన్ వేశారు. ప్రయాణికుల ఫిర్యాదుతో మంగళవారం ఆర్టీసీ ఆర్ఎం సీహెచ్.వెంకన్న స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఖమ్మం న్యూ బస్టాండ్ లో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్న 8 షాపులకు
కలిపి రూ.10 వేలు, సత్తుపల్లి బస్టాండ్ లో ఇద్దరు ఓనర్లకు కలిపి రూ.1500, ఇల్లెందు బస్టాండ్ లో ఇద్దరికి కలిపి రూ.500, భద్రాచలంలో ఆరుగురు ఓనర్లకు కలిపి రూ.6 వేలు ఫైన్ విధించినట్లు వెంకన్న తెలిపారు. బస్టాండుల్లో నిబంధనలకు విరుద్ధంగా వస్తువులను అమ్మితే చర్యలు తప్పవని హెచ్చరించారు.