
భద్రాచలం,వెలుగు : కోడి కత్తులు తయారు చేసి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులపై సోమవారం దుమ్ముగూడెం పోలీసులు బైండోవర్ కేసు నమోదు చేశారు. దుమ్ముగూడెం మండల పరిధిలోని పెద్ద ఆర్లగూడెం గ్రామానికి చెందిన కారం చలపతి, కారం కన్నప్పరాజు ఇంటి వద్ద కోడికత్తులు తయారు చేస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోడి పందాల నిర్వాహకులు నుంచి వచ్చిన డిమాండ్ మేరకు కోడి కత్తులను తయారు చేస్తున్నారు. వీరి నుంచి 15 కత్తులను స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరినీ దుమ్ముగూడెం తహసీల్దార్ ఎదుట ప్రవేశపెట్టి ఒక సంవత్సర కాలానికి లక్ష రూపాయల మొత్తానికి బైండోవర్ చేయించారు.