![సెమిస్టర్ ఎగ్జామ్స్ వాయిదా వేయాలి ఓయూ పీజీ స్టూడెంట్ల నిరసన](https://static.v6velugu.com/uploads/2025/02/semester-exams-should-be-postponed-protest-by-ou-pg-students_zxs6J7Oe8o.jpg)
ఓయూ, వెలుగు: సెమిస్టర్ పరీక్షలు వాయిదా వేయాలంటూ ఉస్మానియా యూనివర్సిటీ పరిపాలన భవనం వద్ద పీజీ స్టూడెంట్లు ఆందోళన చేపట్టారు. సెల్ ఫోన్ల లైటింగ్‌లో పరిపాలన భవనం వద్ద బైఠాయించారు. ఈ సందర్భంగా పీజీ విద్యార్థులు మాట్లాడుతూ.. ఫిబ్రవరి 15, 16 తేదీల్లో గేట్ పరీక్షలు, ఫిబ్రవరి 28న నెట్ ఎగ్జామ్స్ ఉండడం వల్ల ఫిబ్రవరి 17 నుంచి 27 వరకు నిర్వహించే పీజీ సెమిస్టర్ పరీక్షలు రాయలేకపోతున్నామని వాపోయారు.
పరీక్షలకు ప్రిపేర్ అయ్యే సమయం ఇవ్వాలని కోరారు. మూడు రోజులుగా ఓయూ అధికారులకు వినతిపత్రం ఇచ్చిన స్పందన లేదన్నారు.