Women's T20 World Cup 2024: కంగారులను కొట్టాల్సిందే: భారత్ సెమీస్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే..?

విమెన్స్‌‌‌‌ టీ20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌లో భాగంగా గ్రూప్ ఏ సెమీస్ సమరం ఆసక్తికరంగా మారింది. ఆడిన మూడు మ్యాచ్ ల్లో ఓడిపోయి శ్రీలంక టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఆడిన రెండు మ్యాచ్ ల్లో గెలిచిన ఆస్ట్రేలియా మరో మ్యాచ్ గెలిచినా ఈజీగా సెమీస్ కు చేరుతుంది. పటిష్టమైన ఆసీస్ జట్టుకు సెమీస్ కు చేరడం పెద్ద కష్టం కాదు. ఈ రేస్ లో భారత్ తో పాటు పాకిస్థాన్, న్యూజీలాండ్ జట్లు సెమీస్ రేస్ లో ఉన్నాయి. ఈ మూడు జట్లలో ఒక్క జట్టే సెమీస్ కు చేరే అవకాశాలు ఉన్నాయి. 

భారత్ అవకాశాలు ఎలా ఉన్నాయంటే..?
   
భారత్ ప్రస్తుతం మూడు మ్యాచ్‌లలో నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. సెమీస్‌‌‌‌ ఆశలు సజీవంగా ఉండాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌‌‌‌లో ఆల్‌‌‌‌రౌండ్‌‌‌‌ షోతో అదరగొట్టింది. బుధవారం జరిగిన గ్రూప్‌‌‌‌–ఎ మూడో లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో టీమిండియా 82 రన్స్‌‌‌‌ తేడాతో శ్రీలంకపై భారీ విజయం సాధించింది. నెట్ రన్ రేట్ (+0.576) పెంచుకోవడం భారత్ కు అనుకూలంగా మారింది. మిగిలిన మ్యాచ్ ఆస్ట్రేలియాతో ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే న్యూజిలాండ్, పాకిస్థాన్ పై మెరుగైన రన్ రేట్ ఉంది కాబట్టి సెమీస్ కు చేరుతుంది. 

ఒకవేళ ఆస్ట్రేలియాతో ఓడిపోతే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. న్యూజిలాండ్ తన చివరి రెండు లీగ్ మ్యాచ్ ల్లో ఒకటి ఖచ్చితంగా ఓడిపోవాలి. శ్రీలంక, పాకిస్థాన్ లతో మ్యాచ్ లు ఉన్నాయి. ఈ రెండు జట్లపై కివీస్ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తుంది. మరోవైపు పాకిస్థాన్ కూడా చివరి రెండు లీగ్ మ్యాచ్ ల్లో ఒకటి ఓడిపోవాలి. న్యూజిలాండ్, పాకిస్థాన్ ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఒకటి గెలిచింది. ఈ గ్రూప్ లో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగే మ్యాచ్ తో పాటు పాకిస్థాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్ లు కీలకం కానున్నాయి.