ODI World Cup 2023: అద్భుతాలు ఆశించడం అనవసరం..సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే

ODI World Cup 2023: అద్భుతాలు ఆశించడం అనవసరం..సెమీస్ చేరేది ఆ నాలుగు జట్లే

వరల్డ్ కప్ 2023 లో సెమీస్ చేరే జట్లేవీ అనే దానిపై ఒక అవగాహన రానే వచ్చింది. పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్లకు వరుస పరాజయాల నేపథ్యంలో ఈ వరల్డ్ కప్ లో భారత్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు దాదాపుగా సెమీస్ బెర్త్ ను ఖారారు చేసుకున్నాయి. బంగ్లాదేశ్, శ్రీలంక, నెదర్లాండ్స్, ఆఫ్ఘనిస్తాన్ జట్లకు ఏదో మూల ఆశ ఉన్నా సెమీస్ చేరడం అసాధ్యామనే చెప్పాలి. 

ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచుల్లో గెలిచిన భారత్.. మరో నాలుగు మ్యాచ్ ల్లో ఒక్క మ్యాచ్ లో గెలిచినా సెమీస్ కు వెళ్తుంది. నెదర్లాండ్స్, శ్రీలంక జట్ల మీద మ్యాచ్ లు ఉండడంతో భారత్ సెమీస్ కు చేరడం నల్లేరు మీద నడకే. ఇక దక్షిణాఫ్రికా ఆడిన ఆరు  మ్యాచుల్లో ఐదింటిలో విజయం సాధించి దాదాపు సెమీస్ కు చేరుకుంది. నెట్ రన్ రేట్ బాగా ఉండడం సఫారీలకు కలిసి వస్తుంది. 

మిగిలిన మూడు మ్యాచుల్లో ఒకటి గెలిచినా సెమీస్ బెర్త్ కన్ఫర్మ్ చేసుకుంటుంది. ఇక ఆ తర్వాత న్యూజీలాండ్ ఆడిన ఐదు మ్యాచుల్లో నాలుగు విజయాలు సాధించగా.. కివీస్ ఉన్న ఫామ్ కు మరో రెండు మ్యాచ్ లు గెలవడం అంత కష్టం కాకపోవచ్చు. ఇక ఆస్ట్రేలియా వరుసగా మూడు విజయాలతో ఆత్మ విశ్వాసంతో ఉంది. మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఆసీస్ మూడు మ్యాచ్ ల్లో గెలవాలి. వీటిలో న్యూజీలాండ్ మినహాయిస్తే పెద్ద జట్లేమీ లేవు. దీంతో ఆసీస్ సెమీస్ కు చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 

ఈ లిస్టులో వెనకపడిన జట్లు పాకిస్థాన్, ఇంగ్లాండ్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్ ఈ నాలుగు జట్లు కూడా ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో ఓడిపోయి డేంజర్ జోన్ లో ఉన్నాయి. వీరు మిగిలిన మ్యాచుల్లో గెలిచినా ఇతర జట్ల ఫలితాల మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఇక ఈ నాలుగు జట్లతో పోల్చుకుంటే శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్ జట్లకు కాస్త మెరుగ్గా అవకాశాలు ఉన్నప్పటికీ వరుసగా నాలుగు మ్యాచుల్లో ఈ రెండు జట్లు గెలవడం శక్తికి మించిన పని. 

ఇప్పటివరకు 28 మ్యాచులు ముగిసిపోయాయి. మరో రెండు వారాల్లో లీగ్ మ్యాచులన్నీ అయిపోతాయి. మొత్తానికి అద్భుతాలు ఏమీ జరగకపోతే భారత్, ఆస్ట్రేలియా, న్యూజీలాండ్, సౌత్ ఆఫ్రికా జట్లు సెమీస్ కు  చేరడం ఖాయంగా కనిపిస్తుంది. మరి మిగిలిన రెండు వారాల్లో ఫలితాలు ఎలా వస్తాయో చూడాలి.