పరిశ్రమల స్థాపనకు భారత్ అనుకూలం: ప్రధాని మోదీ

పరిశ్రమల స్థాపనకు భారత్ అనుకూలం: ప్రధాని మోదీ

గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనలో భాగంగా గాంధీనగర్‌లో పర్యటించారు. మహాత్మా మందిర్ కన్వెన్షన్ సెంటర్‌లో సెమీకండక్టర్ పరిశ్రమపై 'సెమీకాన్ ఇండియా 2023' ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. అనంతరం ప్రధాని ఎగ్జిబిషన్‌లోని స్టాళ్లను మోదీ సందర్శించారు.  ఈ సందర్భంగా ప్రధాని మోదీ ప్రసంగించారు. సెమికాన్ ఇండియాలో పాల్గొనేందుకు భారతీయ, విదేశీ కంపెనీలు ఇక్కడికి వచ్చాయి.. భారత్ ఎప్పుడు ఎవ్వరినీ నిరాశపర్చదని మోదీ అన్నారు. 21 వ శతాబ్ధంలో భారత్ లో  అపారమైన అవకాశాలు ఉన్నాయని, అందుకు అనువైన వాతావరణాన్ని కల్పిస్తోందని స్పష్టం చేశారు. 

గ్లోబల్ మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో భారత దేశ వాటా అనేక రెట్లు పెరిగిందన్నారు ప్రధాని మోదీ. అత్యుత్తమ మొబైల్ ఫోన్ల తయారీ చేయడంతో ఎగమతి చేస్తుందన్నారు. 4వ పారిశ్రామిక విప్లవానికి, భారతదేశ ఆకాంక్షలకు మధ్య సంబంధం ఉందన్నారు. భారత్‌లో అత్యంత పేదరికం వేగంగా నిర్మూలించబడుతోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ః

భారత్ లో స్థిరమైన, బాధ్యతాయుతమైన, సంస్కరణల ప్రభుత్వం పనిచేస్తోంది కాబట్టి పెట్టుబడిదారులు భారత దేశాన్ని పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని ప్రధాని మోదీ అన్నారు. ఇండియాలో సెమీ కండక్టర్స్ పరిశ్రమలను  ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని.. ఇప్పటికే ప్రత్యేక కోర్సు ఉండే మూడు వందల కాలేజీలను గుర్తించామని ప్రధాని తెలిపారు. 

AsloRead:సిరాల గ్రామం జలదిగ్బంధం.. సాయం కోసం ఆర్తనాదాలు

#WATCH | At SemiconIndia Conference 2023, PM Narendra Modi says, "In India of the 21st century, there is immense opportunity for you. India's democracy, India's demography and dividend from India can double, triple your business." pic.twitter.com/NSGrrGjBTb

— ANI (@ANI) July 28, 2023