ట్రంప్ కేబినెట్​లో తొలి నియామకం..విదేశాంగ మంత్రిగా రూబియో

ట్రంప్ కేబినెట్​లో తొలి నియామకం..విదేశాంగ మంత్రిగా రూబియో
  • ట్రంప్ కేబినెట్​లో తొలి నియామకం

వాషింగ్టన్: ఫ్లోరిడాకు చెందిన సెనేటర్ మార్కో రూబియో.. విదేశాంగ శాఖ మంత్రిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కేబినెట్​లో రూబియోకు తొలి స్థానం దక్కింది. 53 ఏండ్ల రూబియో.. నిరుడు కాంగ్రెస్​లో ఓ బిల్లు ప్రవేశపెట్టారు. 

జపాన్, ఇజ్రాయెల్, కొరియా, నాటో మిత్ర దేశాలతో సమానంగా ఇండియాను చూడాలని ఆ బిల్లులో పేర్కొన్నారు. ఇండియా సమగ్రతకు వాటిల్లుతున్న ముప్పును దృష్టిలో పెట్టుకుని మద్దతుగా నిలవాలని రూబియో ప్రతిపాదించారు. 

ఇండియాకు వ్యతిరేకంగా టెర్రరిజాన్ని ప్రోత్సహించినట్లు తేలితే.. పాకిస్తాన్​కు భద్రతాపరమైన సహాయం నిలిపివేయాలని కూడా ఆ బిల్లులో ఆయన పేర్కొన్నారు. రూబియోతో సహా 99 మంది సెనేటర్లు బిల్లుకు అనుకూలంగా ఓటు వేశారు. 

ఇండియా విషయంలో మార్కో.. ఎప్పుడూ పాజిటివ్​గా వ్యవహరిస్తూ వచ్చారు. చైనా విషయంలో కఠినంగా వ్యవహరిస్తారనే టాక్ ఉన్నది. దీంతో రూబియోను తమ భూభాగంలో అడుగుపెట్టకుండా 2020లో చైనా రెండుసార్లు ఆంక్షలు విధించింది. సెనేట్ సెలెక్ట్ కమిటీ ఆన్ ఇంటెలిజెన్స్​లోనూ ఆయన సభ్యుడిగా ఉన్నాడు.