బైడెన్ పోటీనుంచి తప్పుకుంటే మంచిది: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా

 బైడెన్ పోటీనుంచి తప్పుకుంటే మంచిది: అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా

US Presidential Election 2024: జో బైడెన్..అమెరికా అధ్యక్ష పోటీ నుంచి తప్పుకోవాలని ఒత్తిడి పెరుగుతోంది. బైడెన్ అభ్యర్థిత్వంపై సాధ్యాసాధ్యాలను తీవ్రంగా పరిగణించాలని డెమోక్రాట్లు అంటున్నారు.ఇటీవల కీలక ప్రసంగాల్లో బైడెన్ తడబాటు.. వయసురీత్యా అతని అభ్యర్థిత్వంపై  ప్రతి పక్ష పార్టీ రిపబ్లికన్లు విమర్శలు చేస్తుండగా.. మరోవైపు సొంత పార్టీ డెమోక్రాట్ నేతలు కూడా పలు  సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. 

బైడెన్ అధ్యక్ష ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటేనే బాగుంటుందని సూచిస్తున్నారు. ఇప్పటివరకు ఈ విమర్శలు సెనెటర్లు నుంచే మాత్రమే వచ్చాయి.. ఇప్పుడు మాజీ అధ్యక్షుడు, బైడెన్ ప్రభుత్వం లో ఉపాధ్యక్షుడిగా పనిచేసిన బరాక్ఒబామా కూడా ఆ లిస్టులో చేరారు.. తాజాగా బైడెన్ అభ్యర్థిత్వంపై కీలక ప్రకటనలు చేశారు. జో బైడెన్ తన రీ ఎలక్షన్ బిడ్ ను పున పరిశీలించాల్సిన అవసరం ఉందని అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా మిత్రదేశాలకు చెప్పినట్టు గురువారం వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. 

81 యేళ్ల జో బైడెన్ అభ్యర్థిత్వంపై పలు అనుమానాలు వ్యక్తం చేసిన బరాక్ ఒబామా.. అధ్యక్షుడిగా బైడెన్ విజయావాకాశాలు తగ్గిపోయాయని, అతని అభ్యర్థిత్వంపై  సాధ్యతను తీవ్రంగా పరిగణించాలని కోరారు. 

2009 నుంచి 2017 వరకు బైడెన్ వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసిన బరాక్ ఒబామా ..ఆ సమయంలో బైడెన్ పై ఎలాంటి సందేహం లేదని.. ఇప్పుడు అభ్యర్థిత్వంపై ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. 

డొనాల్డ్ ట్రంప్ తో అధ్యక్ష డిబేట్ లో బైడెన్ సరితూగలేకపోవడం.. తడబాటుతో బైడెన్ తప్పుకోవాలని తన సొంత పార్టీ నేతలే పిలుపునిచ్చారు. పార్టీలో పెరుగుతున్న కోరస్ లో ఇప్పుడు ఒబామా కూడా చేరిపోయారు. 

అయితే కోవిడ్ తో బీచ్ హౌజ్ లో ఐసోలేషన్ లో ఉన్న జో బైడెన్.. అతని వయస్సు, ఫిట్ నెస్ గురించి ఆందోళనలను తిరస్కరించాడు. తాను వైట్ హౌజ్ రేసులో ఉన్నానని తనపై వస్తున్న విమర్శ లను కొట్టిపారేశాడు. 

ఇటీవల డెమాక్రటిక్ సెనేట్ నేతలు చక్ షుమెర్, హకీమ్ జెఫ్రీస్ కూడా బెడైన్ తో సమావేశమై .. వచ్చే ఎన్నికల పోటీ నుంచి తప్పుకోవాలని హెచ్చరించారు. దీంతో బైడెన్ పై ఒత్తిడి పెరుగుతోంది.