
- హిందూ వ్యతిరేకి ఎంఐఎంతో బీఆర్ఎస్ దోస్తీ మంచిది కాదు
ఆదిలాబాద్, వెలుగు : అవినీతి బీఆర్ఎస్సర్కారును గ్యారేజ్ కు పంపించే సమయం వచ్చిందని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే అన్నారు. ఆదిలాబాద్ బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ తరఫున ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్లో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్కు వీఆర్ఎస్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందన్నారు. కనీసం తమ సంఘానికి సహకరించని బీఆర్ఎస్ అభ్యర్థి జోగు రామన్న కంటే బీజేపీలో సామాన్య కార్యకర్తలా ప్రజలకు అందుబాటులో ఉండే పాయల్ శంకర్ కు ఓటేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్రూ.లక్ష కోట్లతో కాళేశ్వరం కట్టి అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. 15 నిమిషాల టైం ఇస్తే హిందువులను లేకుండా చేస్తానన్న ఎంఐఎంతో కేసీఆర్ దోస్తీ కట్టడం మనకు మంచిది కాదన్నారు.
బీఆర్ఎస్ కు వీఆర్ఎస్ ఇవ్వాలి
ధర్మపురి : ధర్మపురిలో బీజేపీ అభ్యర్థి ఎస్.కుమార్ కు మద్దతుగా నిర్వహించిన సభలో ఏక్ నాథ్ షిండే మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఇండియాను అగ్ర దేశాల జాబితాలో నిలిపిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని, అందుకే బీజేపీని గెలిపించాలని కోరారు.