‘మా’ ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, సీవీఎల్ నరసింహరావు అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నారు. నిన్న విష్ణు తన ప్యానెల్‌తో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో నరేష్ మాట్లాడుతూ ‘కొంతమంది మీడియా ముందు ఏవేవో అబద్ధాలు చెప్పేస్తున్నారు. వాళ్లు అంటున్నట్టు ‘మా’ మసకబారలేదు. నేను ఇరవయ్యేళ్ల పాటు సభ్యుడిగా ఉన్నాను. జాయింట్ సెక్రెటరీగా చేశాను. ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా చేయమన్నా చేస్తాను. ఇక్కడ స్థాయి అంటూ ఏముంది! నేను వెల్ఫేర్ కమిటీ చైర్మన్‌గా ఉన్నప్పుడు అందరికీ అవకాశాలు కల్పించాం. ఆరోగ్యం, పెన్షన్స్ వంటి వాటిపై దృష్టి పెట్టాం. కరోనా సమయంలోనూ సాయం చేశాం. ఈ మూడేళ్లలో ‘మా’ ముందుకు పోయిందే కానీ మసకబారలేదు. మాకెవరికీ పదవీ వ్యామోహం లేదు. ‘మా’ అనేది రాజకీయ వేదిక కాదు. ‘మా’ అధ్యక్షుడిగా ఒక తెలుగువాడే ఉండాలి. ఎవరు పడితే వాళ్లొచ్చి కూర్చుంటే ‘మా’ మసకబారడం కాదు, అదో మచ్చలా మిగిలిపోద్ది. ప్రకాష్‌రాజ్‌ని నేను అడుగుతున్నా. మీరెప్పుడైనా ‘మా’ సమావేశాల్లో పాల్గొన్నారా? ఎన్నికల్లో ఓటు వేశారా? ఎప్పుడైనా ఏ సభ్యుడికైనా ఫోన్ చేసి కనీసం బర్త్ డే విషెస్ చెప్పారా? మరి ఇప్పుడెందుకొచ్చింది మా మీద ఇంత ప్రేమ? అసలీ పోటీలోకి మీ అంతట మీరే వచ్చారా లేక ఎవరైనా తీసుకొచ్చారా? నా తర్వాత ‘మా’కి మరో మంచి అధ్యక్షుణ్ని అందించడం నా బాధ్యత. అందుకే నేను విష్ణుకు మద్దతు ఇస్తున్నాను. తనీ పదవికి తగిన వ్యక్తి. నేను విష్ణు రథం ఎక్కుతున్నాను. తను గెలిచినా ఓడినా మేమంతా ‘మా’ సభ్యులమే’ అన్నారు.
తెలుగువాడే ‘మా’ అధ్యక్షుడు కావాలి
- టాకీస్
- September 30, 2021
లేటెస్ట్
- విజయ్ 69 రీమేక్ పై క్లారిటీ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి
- Champions Trophy 2025: టీమిండియాకు షాక్.. ఛాంపియన్స్ ట్రోఫీ ప్రారంభ మ్యాచ్‌లకు బుమ్రా దూరం
- Health tips..ఊరెళ్తున్నారా.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
- బెస్ట్ టూరిస్ట్ స్పాట్..ప్రకృతి అందాల పాపికొండలు..
- వివేకానంద జయంతి.. సంకల్ప బలం వివేకానందం
- Realme 14 Pro Plus:యునీక్ పెరల్ డిజైన్..రంగులు మార్చే స్మార్ట్ ఫోన్
- కాఫీ, టీలకు స్టీల్ గ్లాస్..దీనిని మడత పెట్టేయొచ్చు..
- ఉచితం అనుచితం!
- తెలంగాణ కిచెన్ : ఈ సంక్రాంతికి మన వంటకాలు
- Daaku Maharaj Review: బాలకృష్ణ డాకు మహారాజ్ రివ్యూ. ఎలా ఉందంటే..?
Most Read News
- Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’ టాక్ వచ్చేసింది.. సంక్రాంతి విన్నరో.. కాదో.. తేలిపోయింది..
- చేతిలో ఇంకో జాబ్ ఆఫర్ లేదు.. ఇన్ఫోసిస్‌లో జాబ్ మానేశాడు.. ఎందుకని అడిగితే 6 రీజన్స్ చెప్పాడు..!
- ప్రపంచంలో ఎక్కువ పని గంటలు ఉన్న టాప్ 5 దేశాలు ఇవే.. ఇండియా ఎన్నో ప్లేస్ అంటే..
- IND vs ENG: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్.. భారత జట్టు ప్రకటన
- జనవరి 26 నుంచి పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు: పొంగులేటి శ్రీనివాసరెడ్డి
- Video Viral: జూనియర్ ఎన్టీఆర్ రోడ్డుపై వెళ్తున్నా కనీసం పట్టించుకోని జనం.. ఎక్కడంటే.?
- Good Health: రోజూ 2 ఖర్జూర పండ్లతో కలిగే 6 లాభాలు..
- తెలంగాణ తెల్ల కల్లు, మటన్ కాంట్రవర్సీపై క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..
- SSMB29: మహేష్‌ని ఓ రేంజ్లో సానబెడుతున్న డైరెక్టర్ జక్కన్న.. స్పెషల్ ట్రైనింగ్ కోసం చైనాకి సూపర్ స్టార్!
- పంతంగి టోల్ ప్లాజా మీదుగా వెళ్లే పబ్లిక్కు చౌటుప్పల్ ఏసీపీ కీలక సూచన