ఏసీబీకి చిక్కిన నెహ్రు జూలాజికల్ పార్క్ సీనియర్ అసిస్టెంట్

హైదరాబాద్: నగరంలో నెహ్రు జూలాజికల్ పార్క్  సీనియర్ అసిస్టెంట్  ఏసీబీ అధికారులకు చిక్కారు. పెన్షన్ కు సర్టిఫికెట్ ఇచ్చేందుకు సైఫాబాద్ కు చెందిన అజామ్ షరీఫ్ నుంచి రూ. 5వేల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులు సీనియర్ అసిస్టెంట్ రమేష్ ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.  తన తల్లి పెన్షన్ ను పెండ్లికానీ సోదరిపేరున మార్చాలని సీనియర్ అసిస్టెంట్ సరాఫ్ రమేష్ ను సంప్రదించగా లంచం డిమాండ్ చేశారు. దీంతో గురువారం (మార్చి 14)  అజామ్ నుంచి 5వేల రూపాయలు లంచంగా ఏవో ద్వారా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. సరాఫ్ రమేష్ ను అరెస్ట్ చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరు పర్చారు అధికారులు. ఈ కేసు విచారణ కొనసాగుతోంది.