కోఠి ఈఎన్టీ హాస్పిటల్లో లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన సీనియర్ అసిస్టెంట్

హైదరాబాద్ కోఠి ఈఎన్టీ హాస్పిటల్ లో ఏసీబీ సోదాలు చేసింది.  సీనియర్ అసిస్టెంట్ సంతోష్ తివారీ మూడు వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. 

 రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేందుకు ఓ  వ్యక్తి నుంచి రూ. 20 వేలు డిమాండ్ చేశాడు  సీనియర్ అసిస్టెంట్ సంతోష్ తివారీ.  మొదట 17 వేలు తీసుకున్న సంతోష్ తివారీ... జనవరి 17న  మరో మూడు వేలు తీసుకుంటుండంగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఏసీబీ అధికారులు.

ALSO READ | కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం లంచం డిమాండ్ చేసిన ఆర్ఐ... ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు..