![దేశం సిగ్గుతో బాధపడుతుంది : రాములమ్మ ఆగ్రహం](https://static.v6velugu.com/uploads/2023/07/Senior-BJP-leader-Vijayashanthi_0bm3AXVfT7.jpg)
మణిపూర్ లో జరుగుతున్న సంఘటనలపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి ట్విట్టర్ వేదికగా స్పందించారు. మణిపూర్ ఘటనలు యావత్ దేశాన్ని తీవ్ర వేదనకు గురి చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడి వరుస పరిణమాలతో సభ్యసమాజం సిగ్గుతో బాధపడుతోందన్నారు. అల్లర్లకు, అమానవీయ సంఘటనలకు బాధ్యులైన నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేశారు.
మరోవైపు.. రాములమ్మ ట్వీట్ బీజేపీ పార్టీలోనే కాదు.. రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ మధ్య ఒక ట్వీట్ చేసి సర్వత్రా చర్చనీయాంశంగా మారారు. ఈ క్రమంలోనే మరోసారి ట్వీట్ చేసి, చర్చకు తెరలేపారు. అసలింతకు రాములమ్మకు ఏమైంది...? అని అందరూ చర్చించుకుంటున్నారు.ఏది ఏమైనా విజయశాంతి డేరింగ్ డ్యాష్ అని మరికొందరు పొగడ్తలు కురిపిస్తున్నారు. రాములమ్మ చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
మణిపూర్లో జరుగుతున్న సంఘటనలు యావత్ దేశాన్ని త్రీవ్ర వేదనకు గురిచేస్తున్నాయి.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) July 25, 2023
సభ్యసమాజం సిగ్గుతో బాధపడుతున్నది.
పై చర్యలో పాల్గొన్న
నేరస్థులు ఉరితీసి శిక్షించబడాలని కోరుకుంటున్నాను. pic.twitter.com/qIZJUO4fPg