నవాబుపేట, వెలుగు: కన్నతల్లికి తిండిపెట్టకుండా, వైద్యం చేయించకుండా ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన కొడుకుకు సీనియర్స్ సిటిజన్స్ ఫోరం సభ్యులు కౌన్సిలింగ్ ఇచ్చారు. మండలంలోని యన్మన్గండ్ల గ్రామానికి చెందిన కొల్లూరు మైసమ్మ (70)ని ఆమె కొడుకు నర్సింలు, కోడలు వేధించి ఇంట్లో నుంచి వెళ్లగొట్టారు. అప్పటి నుంచి ఆమె మహబూబ్నగర్లో ఉంటున్న కూతురు వెంకటమ్మ ఇంట్లో ఉంటోంది.
Also Read:సాగు నీటి దినోత్సవానికి స్పందన కరవు..
ఇటీవల కూతురుకు భారం కావద్దని భావించి వమోవృద్ధుల సహాయ కేంద్రాన్ని సంప్రదించగా, బుధవారం నవాబుపేటలోని సీనియర్సిటిజన్స్ ఫోరం ఆఫీసులో సహాయ కేంద్రం సభ్యులు, ఫోరం సభ్యులు పోలీసుల సమక్షంలో నర్సింలుకు కౌన్సిలింగ్ ఇచ్చారు. తల్లి పోషణ కోసం ప్రతి నెలా రూ.3 వేలు చెల్లించాలని, ప్రతి వారం తల్లిని కలవాలని సూచించారు. నాగరాజు, నాగభూషణం, చిగిళ్లపల్లి నర్సింలు, వెంకటేశ్వరప్ప, చంద్రశేఖర్, గాండ్లశంకరయ్య, వెంకటేశ్, చిన్నయ్య, ఏఎస్ఐ ఆనంద్, పండరీనాథ్ పాల్గొన్నారు.