సీనియర్ సిటిజన్లే .. సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్ల టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

  • సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేరగాళ్ల టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌.. సీనియర్ సిటిజన్లు
  • డిజిటల్ ట్రాన్సాక్షన్లపై వీరికి తక్కువ అవగాహన ఉండడమే కారణం
  • రూ. వేల కోట్లలో ప్రాఢ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..ఇండియాలో నడుస్తున్న పెద్ద నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు:   సైబర్ నేరగాళ్లు సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేయడం పెరిగింది. చాలా కేసుల్లో  నష్టపోతున్న డబ్బులు తక్కువే అయినప్పటికీ  సైబర్ నేరగాళ్ల మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టార్గెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వీరు మారిపోయారు. పెద్ద అమౌంట్ కాకపోవడంతో పోలీసుల స్పాట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఇలాంటి కేసులు పడడం లేదు. దేశంలో  13.8 కోట్ల మంది 60 ఏళ్లకు పైబడిన వారు ఉన్నారని 2021 లో ఓ రిపోర్ట్ అంచనావేసింది. ఈ నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంకో పదేళ్లలో 19.4 కోట్లకు చేరుకుంటుందని అంచనా.  బిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పేమెంట్స్ నుంచి బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, షాపింగ్ వరకు అంతా ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వేగంగా షిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతుండడంతో అడ్జస్ట్ అవ్వడంలో సీనియర్ సిటిజన్లే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. 

రూ.25 వేల కోట్ల ఫ్రాడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..

గత కొన్నేళ్లుగా ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. దేశంలోనే కాదు  యూఎస్, యూఎకే వంటి దేశాల్లో నివసిస్తున్న సీనియర్ సిటిజన్లను  సైబర్ నేరగాళ్లు టార్గెట్ చేస్తున్నారు. ‘రొమాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, టెక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సపోర్ట్ వంటి అంశాలకు  చెందిన ఫ్రాడ్స్ ఇండియాలోని  ఇల్లీగల్ కాల్ సెంటర్లు, ఫిషింగ్ గ్యాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల నుంచి  జరుగుతున్నాయి. గత రెండేళ్లలో యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  అమాయకులైన సీనియర్ సిటిజన్ల నుంచి రూ.25 వేల కోట్లు (3 బిలియన్ డాలర్లు) మోసం చేశారు’ అని  యూఎస్ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ) ను కోట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేస్తూ టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. కోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కతా, ఫరీదాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఘజియాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఇండోర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వంటి సిటీలను, చిన్న పట్టణాలను కూడా బేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా చేసుకొని సైబర్ నేరగాళ్లు పనిచేస్తున్నారని సీనియర్ పోలీస్ అధికారులు వెల్లడించారు. సైబర్ నేరగాళ్లను పట్టుకోవడానికి కొన్ని కేసుల్లో  యూస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ కూడా లోకల్ అథారిటీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో కలిసి పనిచేస్తోందన్నారు. మరోవైపు మోసగాళ్లు కూడా తమ స్ట్రాటజీలను మారుస్తున్నారు. పెద్ద కాల్ సెంటర్లకు బదులు చిన్న బీపీఓ సెంటర్లతో దేశంలోని సీనియర్ సిటిజన్లను టార్గెట్ చేయడం పెంచారు. 

ALSO READ:ముస్లిం డిక్లరేషన్ కీలకం.. స్కీమ్స్, రిజర్వేషన్ల పేరిట గాలం

సీనియర్ సిటిజన్లే ఎందుకంటే?

దేశంలో డిజిటల్ పేమెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వేగంగా విస్తరిస్తున్నాయి.  మొదట ఇటువంటి ట్రాన్సాక్షన్లకు దూరంగా ఉన్న  ఓల్డర్ జనరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ప్రస్తుతం ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ట్రాన్సాక్షన్ల వైపు మరలుతున్నారు. కరోనా తర్వాత సీనియర్ సిటిజన్లు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, డిజిటల్ పేమెంట్స్ వాడడం మరింత పెరిగిందని చెప్పొచ్చు. పైన పేర్కొన్న రవీంద్ర లేదా మాయకు ఇలాంటి ఫ్రాడ్స్ జరుగుతున్నాయని తెలుసు. తాము జాగ్రత్తగా ఉంటున్నామని కూడా వారు చెప్పారు. కానీ  నెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాంకింగ్ లేదా ఎలక్ట్రిసిటీ వంటి ఇంపార్టెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఆగిపోతాయనే భయంతో  ఆ టైమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నేరగాళ్లు పంపే లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను క్లిక్ చేయడం లేదా పేమెంట్ డిటెయిల్స్ షేర్ చేయడం వంటివి చేస్తున్నారు. 

ఈ టిప్స్ ఫాలో కావాలి..‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ ఫ్రాడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై అవగాహన ఉంటే చాలా వరకు సైబర్ దాడుల నుంచి  మనల్ని మనం రక్షించుకోవచ్చు.  

1. గుర్తు తెలియని వ్యక్తులు లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పంపితే  క్లిక్ చేయొద్దు.
2. ఏదైనా లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్లిక్ చేయమని లేదా యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను డౌన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోడ్ చేయమని చెప్పే మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు ఎక్కడి నుంచి వచ్చాయో తెలుసుకోవాలి. 
3. అనుమానం ఉంటే ఏం చేయకపోవడం బెటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌
4. క్లారిఫికేషన్ కావాలంటే సంబంధిత బ్యాంక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాల్ చేయాలి. మీ పిల్లలు లేదా నమ్మదగ్గ వారి నుంచి సలహా తీసుకోవాలి.
5.  వీలుంటే మల్టీ ఫ్యాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అథంటికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలి. 
6. ర్యాండమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను క్లిక్ చేయడం ద్వారా భారీ డిస్కౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు పొందొచ్చని మోసగాళ్లు ఆకర్షిస్తారు. ఎవరూ ఫ్రీగా ఏం ఇవ్వరు. అందువలన ఇలాంటి డిస్కౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, రాయితీలకు ఆకర్షితులవ్వొద్దు.
7. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి సాయం పొందొద్దు.
8. స్ట్రాంగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్డ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెట్టుకోండి. ఎవరికీ చెప్పొద్దు. 
9. బయోమెట్రిక్ అథంటికేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫీచర్ మీ ఫోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉంటే దానిని వాడండి.

కేసు1: ఇండియన్ రైల్వేస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సౌత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెంట్రల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జోన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేసి తాజాగా రిటైర్ అయిన రవీంద్ర గౌడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ (60) హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తన రిటైర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లైఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గడుపుతున్నారు. ఒక చిన్న తప్పుతో రూ.25 వేలు నష్టపోయారు. ‘ఆధార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లింక్ చేయకపోతే మీ ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఐ యోనో యాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆగిపోతుంది. ఈ కింది ఉన్న లింక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను క్లిక్ చేయండి’ అంటూ వచ్చిన మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో  సైబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌దాడికి గురయ్యారు. ఒరిజినల్ సైట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాదిరే యూజర్ ఇంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫేస్ ఉండడంతో తేడా గమనించని ఆయన, తన ఐడీ, పాస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో లాగిన్ అయ్యారు. కొద్ది క్షణాల్లోనే తన అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి రూ.25 వేల మాయం అయ్యాయని రవీంద్ర వివరించారు.

కేసు 2:  ముంబైలో జీవిస్తున్న 75 ఏళ్ల మాయ ఇలాంటి సైబర్ దాడికే గురయ్యారు.  ఇంకో 24 గంటల్లో ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టకపోతే కరెంట్ ఆగిపోతుందనే మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను మహారాష్ట్ర  ఎలక్ట్రిసిటీ బోర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పంపినట్టు ఆమెకు పంపి, ఒక నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాల్ చేయమని చెప్పారు.  మొదట తన కూతురికి ఈ విషయం చెబుతామని ప్రయత్నించినా, ఆమె బిజీగా ఉండడంతో తనే స్వయంగా మెసేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉన్న నెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు కాల్ చేశారు. బిల్లు కట్టారో లేదో చెక్ చేస్తామని,   డెబిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డిటెయిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో సహా పేమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరాలను ఇవ్వాలని అవతలి వ్యక్తి కోరగా, ఆమె షేర్ చేశారు. అంతే తన అకౌంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని రూ.10 వేలు మాయం అయిపోయాయి.