సబ్​జైల్​ను సందర్శించిన సీనియర్ సివిల్ జడ్జి

జనగామ అర్బన్, వెలుగు: తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ హైదరాబాద్ ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సి.విక్రమ్ సోమవారం జనగామ జిల్లా కేంద్రంలోని సబ్​జైల్ ను సందర్శించి ఖైదీలకు లీగల్ అవేర్నెస్ క్యాంపు నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఖైదీలకు తప్పకుండా అడ్వకేట్లు ఉండి తీరాలన్నారు. లేనివారికి తక్షణమే ఉండేలా లీగల్ ఎయిడ్ డిఫెన్స్​ కౌన్సిళ్లను ఆదేశించారు. మెడికల్​గా ఇబ్బంది పడుతున్న ఖైదీలకు డాక్టర్స్ అందుబాటులో ఉండాలన్నారు. జైలు సిబ్బందికి రిజిస్టర్లు మెయింటైన్​ చేయాలని సూచించారు.