రాజన్న సిరిసిల్ల జిల్లా : బీఆర్ఎస్ పూర్తిగా అవినీతిమయమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ద్వారా నిర్మితమైన సెస్ పూర్తిగా అవినీతిమయమైందని చెప్పారు. ఏ పార్టీ రాజకీయ విధానం రైతులకు అనుగుణంగా ఉంటుందో అందరూ గమనించాలని కోరారు. - ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రజానీకానికి, రైతాంగానికి అనుగుణంగా ఎవరైతే ఉంటారో వారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను, బీఆర్ఎస్ ను రైతులు, ప్రజలు నమ్మవద్దని కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్ లో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. వేములవాడ రూరల్ మండలం వట్టేముల గ్రామంలో ఈ వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ హయాంలో ఉచిత విద్యుత్ ఇచ్చామని, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తోందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఎక్కడా ఇవ్వడం లేదని, 9 గంటలకు మించి విద్యుత్ సరఫరా జరగడం లేదన్నారు.