కాంగ్రెస్ సీనియ‌ర్ నేత న‌ర్సారెడ్డి క‌న్నుమూత‌

తెలంగాణ కాంగ్రెస్ లో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పి. నర్సారెడ్డి (92)  కన్ను్మూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. 2024 జనవరి 29వ తేదీ సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.   నర్సారెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. 

నర్సారెడ్డి నిర్మల్ జిల్లా మలక్ చించోలి గ్రామంలో 1931సెప్టెంబర్ 22న జన్మించారు.  ఉస్మానియా విశ్వవిద్యాలయంలో B.A, L.L.B పట్టాలు పొందారు.   స్వాతంత్ర్య ఉద్యమంలో కూడా పాల్గొన్నారు.  1971 నుంచి 1972 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షులుగా సేవలందించారు.

1978లో మాజీ సీఎం  జలగం వెంగళరావు మంత్రివర్గంలో నీటి పారుదల శాఖ, రెవెన్యూ మరియు శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రిగా  పనిచేశారు.  1991లో ఆదిలాబాద్ ఎంపీగా కూడా ఎన్నికయ్యారు. ఆ తరువాత క్రియాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.