సీపీఐ సీనియర్ నేత వెంకటరెడ్డి మృతి

  •     నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే పువ్వాడ నాగేశ్వరరావు

కూసుమంచి, వెలుగు :  స్వాతంత్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, గైగొల్లపల్లి  మాజీ సర్పంచ్, సీపీఐ సీనియర్ నాయకుడు సంగ బత్తుల వెంకటరెడ్డి (98) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. సీపీఐ మాజీ ఎమ్మెల్యే,  మాజీ ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు  భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్, సహాయ కార్యదర్శి దండి సురేశ్, రాష్ట్ర కంట్రోల్ కమిషన్ చైర్మన్ మహమ్మద్ మౌలానా ఆయన మృతదేహానికి నివాళులర్పించారు. వెంకటరెడ్డి ముగ్గురు కుమారులను , ఒక కూతురును పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా సోమవారం గైగోళ్లపల్లిలో వెంకటరెడ్డి అంత్యక్రియలు జరగనున్నాయి.