వామపక్షాలకు కేసీఆర్ మొండిచేయి చూపించారు : జూలకంటి రంగారెడ్డి

వామపక్షాలకు కేసీఆర్ మొండిచేయి చూపించారు : జూలకంటి రంగారెడ్డి

బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు సీపీఎం సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి. మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టుల అవసరం ఉందని వామపక్షాల సహాయం తీసుకున్నారని, అవసరం తీరాక మభ్యపెడుతూ మొండిచేయి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వామపక్షాలను కేసీఆర్ విస్మరించడం సరికాదన్నారు. మిర్యాలగూడలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో జూలకంటి రంగారెడ్డి ఈ కామెంట్స్ చేశారు. 

వామపక్షాలతో కలిసి ఉంటామని చెప్పిన ముఖ్యమంత్రి.. ఏకపక్షంగా అభ్యర్థులను ప్రకటించడం కేసీఆర్ అవకాశవాదానికి నిదర్శనం అని చెప్పారు జూలకంటి రంగారెడ్డి. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును ప్రజలందరూ గమనిస్తున్నారని.. వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. కేసీఆర్ చేసిన మోసానికి వామపక్ష పార్టీ నాయకులు, కార్యకర్తలెవరూ నిరుత్సాహ పడొద్దని సూచించారు. అవకాశవాద పార్టీలను వచ్చే ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.