ఏసీబీకి చిక్కిన డ్రాఫ్ట్‌‌‌‌ఉమెన్‌‌‌‌

ఏసీబీకి చిక్కిన డ్రాఫ్ట్‌‌‌‌ఉమెన్‌‌‌‌
  • టిప్పన్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ కోసం రూ.20 వేలు డిమాండ్‌‌‌‌
  • మహబూబాబాద్‌‌‌‌ కలెక్టరేట్‌‌‌‌లో డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ

మహబూబాబాద్‌‌‌‌, వెలుగు : మహబూబాబాద్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌లో సర్వే, భూ రికార్డుల అధికారి, సీనియర్ డ్రాఫ్ట్‌‌‌‌ఉమెన్‌‌‌‌గా పనిచేస్తున్న కె.జ్యోతి క్షేమబాయి గురువారం ఏసీబీ ఆఫీసర్లకు పట్టుబడ్డారు. టిప్పన్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ ఇచ్చేందుకు రూ. 20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఆఫీసర్లు రెడ్‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌‌‌‌ పట్టణానికి చెందిన కార్తీక్‌‌‌‌కు మహబూబాబాద్‌‌‌‌ జిల్లా పరిధిలో కొంత భూమి ఉంది. ఈ భూమికి సంబంధించిన టిప్పన్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ కోసం కలెక్టరేట్‌‌‌‌లోని ఆఫీస్‌‌‌‌లో అప్లై చేసుకున్నాడు. ఇందుకోసం రూ. 5 వేల చలానా కూడా కట్టాడు. అయితే టిప్పాన్‌‌‌‌ రికార్డ్‌‌‌‌ ఇచ్చేందుకు రూ. 20 వేలు ఇవ్వాలని కలెక్టరేట్‌‌‌‌లో పనిచేస్తున్న డ్రాఫ్ట్‌‌‌‌ ఉమెన్‌‌‌‌ జ్యోతి క్షేమబాయి డిమాండ్‌‌‌‌ చేసింది. దీంతో కార్తీక్‌‌‌‌ ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. వారి సూచనతో గురువారం కలెక్టరేట్‌‌‌‌లోని ఆఫీస్‌‌‌‌లో డబ్బులు ఇచ్చాడు. అప్పటికే అక్కడ ఉన్న ఏసీబీ ఆఫీసర్లు జ్యోతిని రెడ్‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌గా పట్టుకున్నారు. అనంతరం ఆఫీస్‌‌‌‌లో రికార్డులను పరిశీలించారు. నిందితురాలిని ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు ఏసీబీ డీఎస్పీ చెప్పారు. దాడిలో ఏసీబీ సీఐలు ఎల్.రాజు, ఎస్.రాజు పాల్గొన్నారు.