పద్మ అవార్డుల పై సీనియర్ హీరో నరేష్ సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ తెలుగువాళ్ళకి పద్మ అవార్డుల విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇందులోభాగంగా 46 మూవీస్ ను డైరెక్ట్ చేసిన ఏకైక మహిళా దర్శకురాలు విజయనిర్మలని మా అమ్మకి పద్మ అవార్డ్ ఇవ్వాలని కోరారు. ఈ విషయంపై నేను ఢిల్లీ స్థాయిలో అమ్మకు పద్మ అవార్డ్ కోసం ప్రయత్నించానని కానీ అమ్మకు పద్మ అవార్డు రాలేదని తెలిపాడు. అలాగే విజయ నిర్మల పద్మ అవార్డ్ కోసం కెసిఆర్ గారు కూడా రికమెండ్ చేశారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు. 

ఐతే నేను ఏ గవర్నమెంట్ ను విమర్శించడం లేదని  బీజేపీ వచ్చిన తరువాత నిజంగా ఆ స్థాయి ఉన్న వ్యక్తులకు ఇస్తున్నారని సంతోషం వ్యక్తం చేశాడు. కానీ ఎంజీఆర్ గారు బ్రతికున్నప్పుడు పద్మ అవార్డు సీనియర్ ఎన్టీఆర్ గారికి కూడా రాలేదు కావున కనీసం పోస్టుమసిగా అయిన పద్మ అవార్డు అమ్మకు ఇవ్వాలని ఎమోషనల్ అయ్యాడు. అలాగే తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది ఆ అర్హత కలిగిన వాళ్లు ఉన్నారని మన వాళ్లకు పద్మ అవార్డు లు వచ్చేందుకు ఆమరణ నిరాహారదీక్ష చేసిన తప్పులేదని సంచలన వాఖ్యలు చేశాడు. మళ్లీ  ఇప్పటి నుంచి అమ్మకు పద్మ అవార్డు రావడం కోసం ప్రయత్నిస్తానని తెలిపాడు.