కంటెంట్ ఉంటే కొత్త పాత చూడరు : వెంకట్

కంటెంట్ ఉంటే కొత్త పాత చూడరు : వెంకట్

రవి ప్రకాష్, రాకీ సింగ్ లీడ్ రోల్స్‌‌లో  తరుణ్ రోహిత్,  శ్రీతేజ్, శ్యామల, యోగి ఖత్రి, శ్రీ పవన్ ఇతర పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ‘కోబలి’.  రేవంత్ లేవాక దర్శకత్వంలో  జ్యోతి మెగావత్ రాథోడ్, రాజశేఖర్ రెడ్డి కామిరెడ్డి, తిరుపతి శ్రీనివాసరావు కలిసి నిర్మించారు. ఫ్యాక్షన్ బ్యాక్‌‌డ్రాప్‌‌లో రూపొందిన ఈ సిరీస్ ఫిబ్రవరి 4 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌‌‌‌లో ఏడు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. అన్ని భాషల నుంచి దీనికి మంచి రెస్పాన్స్ వస్తోందని చెప్పిన టీమ్.. ఈ సందర్భంగా థ్యాంక్స్ మీట్ నిర్వహించింది.  

ఈ కార్యక్రమానికి హాజరైన  సీనియర్ హీరో వెంకట్ మాట్లాడుతూ ‘స్టార్లు ఉంటేనే కంటెంట్‌‌ని ఆదరిస్తారు అనేది పాత మాట. కంటెంట్ బాగుంటే కొత్త పాత తేడా లేదు అని ప్రేక్షకులు ప్రూవ్ చేస్తూనే ఉన్నారు’ అని చెప్పారు.  ఈ సిరీస్‌‌ను ఆదరించి, సక్సెస్ చేసిన ప్రేక్షకులకు రవి ప్రకాష్, రాకీ సింగ్ థ్యాంక్స్ చెప్పారు.  మంచి రీచ్ వచ్చిందని, దీనికి పార్ట్‌‌2 కూడా ఉంటుందని దర్శకనిర్మాతలు చెప్పారు.