జస్ట్ ఆస్కింగ్ అంటూ స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్

జస్ట్ ఆస్కింగ్ అంటూ స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్

సీనియర్ IAS ఆఫీసర్ స్మితా సబర్వాల్ సంచలన ట్వీట్ చేశారు. ఆల్ ఇండియా సర్వీసెస్ లో దివ్యాంగుల కోటాపై పోస్ట్ పెట్టారు. దివ్యాంగులకు గౌరవం ఇవ్వాల్సిందంటూనే..అత్యంత కీలకమైన IAS, IPS, IFS పోస్టులకు రిజర్వేషన్లు ఎందుకని ప్రశ్నించారు. జస్ట్ అస్కింగ్ అంటూ ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. 

దివ్యాంగులకు ఎయిర్ లైన్ సంస్థ పైలట్ గా ఉద్యోగం ఇస్తుందా..? దివ్యాంగుడైన డాక్టర్ ని మీరు విశ్వసిస్తారా అంటూ పోస్ట్ పెట్టారు. ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగులు ఎక్కువగా ఫీల్డ్ లో ఉండాల్సి ఉంటుందని, ఎక్కువ గంటలు పనిచేయాల్సిన అవసరం ఉంటదని, ప్రజల సమస్యల్ని వినాల్సి ఉందంటూ..ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగాలకు ఫిజికల్ ఫిట్ నెస్ ముఖ్యమన్నారు స్మితా సబర్వాల్. 

స్మితా సభర్వాల్ ట్వీట్ పై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. కొంతమంది అనుకూలంగా..మరికొంత మంది వ్యతిరేకంగా ఫోస్టులు పెడుతున్నారు. దివ్యాంగుల కోటాపై జరిగిన డిస్కషన్ లో డెస్క్, థింక్ ట్యాంక్ లాంటి గవర్మమెంట్ ఆపీసుల్లో దివ్యాంగులకు ఉద్యోగాలు సరిపోతాయని తాను గట్టిగా నమ్ముతానని ట్వీట్ చేశారు స్మితా సబర్వాల్. 

ట్రైనీ IAS పూజా ఖేద్కర్ వివాద సమయంలో స్మితా సబర్వాల్ ట్వీట్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఫేక్ ఫిజికల్ హ్యండిక్యాప్ సర్టిఫికేట్ తో దివ్యాంగుల కోటాలో IAS సెలెక్ట్ అయినట్టు ఆరోపణలొస్తున్నాయి. ఇదే టైమ్ లో స్మితా సబర్వాల్ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.