న్యూఢిల్లీ : కొత్త ఇన్వెస్టర్లు మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు లాంగ్ టెర్మ్‌ను దృష్టిలో పెట్టుకోవాలని సీనియర్ ఇన్వెస్టర్ రమేష్ దమాని సలహా ఇచ్చారు. తాను ఇన్వెస్ట్ చేయడం మొదలు పెట్టినప్పుడు అంటే 1989 లో సెన్సెక్స్ 1,000 పాయింట్ల దగ్గర ట్రేడయ్యిందని, ఇప్పుడు 80 వేలను దాటిందని గుర్తు చేశారు. క్వాలిటీ బిజినెస్‌లలో ఇన్వెస్ట్ చేస్తే లాభాలొస్తాయన్నారు. ‘యువతకు నేను ఇదే చెప్పాలనుకుంటున్నాను. మీకొచ్చే ఆదాయంలో 5–10 శాతాన్నే ట్రేడింగ్‌కు వాడండి.
ఎక్కువ కాలంపాటు హోల్డ్ చేయాలనుకునే హై క్వాలిటీ బిజినెస్‌లలో మిగిలిన 90 శాతాన్ని ఇన్వెస్ట్ చేయండి. అక్కడే అసలైన లాభాలుంటాయి’ అని ఆయన సలహా ఇచ్చారు. వారెన్ బఫెట్ ఇన్వెస్టింగ్ విధానాలను ఉదాహరణగా చూపారు. ‘డబ్బులను తెలివిగా వాడితే, ప్రాఫిట్స్ సంపాదిస్తే మిడిల్ క్లాస్ నుంచి ధనవంతుడిగా మారొచ్చని వారెన్ బఫెట్ నిరూపించారు.
ట్రేడింగ్ ద్వారా నువ్వా పొజిషన్‌కు వెళ్లలేవు. లక్షల్లో ఒకరిద్దరు ట్రేడింగ్‌లో సక్సెస్ సాధించొచ్చు. కానీ, డబ్బులు పోగొట్టుకునేవారే ఎక్కువ ఉంటారు’ అని దమాని పేర్కొన్నారు. రానున్న 10 లేదా 20 ఏళ్లను దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్ చేయాలన్నారు.