ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌గా దినకర్‌ గుప్తా

ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌గా దినకర్‌ గుప్తా

న్యూఢిల్లీ : సీనియర్‌ ఐపీఎస్ అధికారి దినకర్‌ గుప్తా జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) డైరెక్టర్‌ జనరల్‌గా నియమితులయ్యారు.  ఈ మేరకు గురువారం (జూన్ 23న) మినిస్ట్రీ ఉత్తర్వులు జారీ చేసింది. గుప్తా పంజాబ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. ఎన్‌ఐఏ డైరెక్టర్‌ జనరల్‌గా గుప్తా నియామకానికి క్యాబినేట్‌ నియామకాల కమిటీ ఆమోదం తెలిపింది.  మార్చి 31, 2024 వరకు పదవిలో కొనసాగనున్నారు. స్వాగర్‌ దాస్‌ను హోంమంత్రిత్వ శాఖలో ప్రత్యేక కార్యదర్శి (అంతర్గత భద్రత)గా నియమించారు. ఆయన ఛత్తీస్‌గఢ్ కేడర్‌కు చెందిన 1987 బ్యాచ్ ఐపీఎస్‌ అధికారి. ప్రస్తుతం ఇంటెలిజెన్స్ బ్యూరోలో స్పెషల్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయన నవంబర్‌ 30, 2024 వరకు పదవి విరమణ చేసే వరకు సేవలందించనున్నారు.