మియాపూర్, వెలుగు: ఐదో అంతస్తు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి సీనియర్ జర్నలిస్ట్ఆదినారాయణ మృతి చెందాడు. మియాపూర్ మదీనగూడ వినాయక్‌నగర్‌లో తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ బిల్డింగ్‌పైకి ఆయన గురువారం ఉదయం వాకింగ్‌కు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలుజారి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు.
కుటుంబసభ్యుల హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, ట్రీట్మెంట్ తీసుకుంటూ మృతి చెందాడు. ప్రస్తుతం ఈటీవీలో హైదరాబాద్ బ్యూరోచీఫ్‌గా ఉన్న ఆదినారాయణ.. ఈటీవీలో సుమారు 25ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య రమాదేవి, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆదినారాయణ మృతిపై పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సంతాపం తెలిపారు.
సీఎం సంతాపం..
ఆదినారాయణ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదినారాయణ ఆకస్మిక మృతి బాధాకరమన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. భగవంతుడు మనో ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు.