గుండెపోటుతో సీనియర్​ జర్నలిస్టు మృతి

గుండెపోటుతో సీనియర్​ జర్నలిస్టు మృతి

ఆర్మూర్, వెలుగు :  ఆర్మూర్​ జర్నలిస్టు కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు,  సీనియర్​ జర్నలిస్టు గోసికొండ అశోక్​ మంగళవారం తెల్లవారు జామున హార్ట్​ ఎటాక్​ తో మృతిచెందారు. కరీంనగర్​ జిల్లా హుస్నాబాద్ కు చెందిన అశోక్​ 30  ఏండ్ల క్రితం ఆర్మూర్​కు వచ్చి,  అప్పటి  నుంచి జర్నలిస్టుగా కొనసాగుతున్నారు. జర్నలిస్టుకాలనీలో నివాసం ఉంటున్న ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.

రాష్ట్ర మినరల్​ డెవలప్​మెంట్​ చైర్మన్ ఈరవత్రి అనిల్​, ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్​ రెడ్డి, కాంగ్రెస్​ పార్టీ ఆర్మూర్​ నియోజకవర్గ ఇన్​చార్జి పొద్దుటూరి వినయ్ రెడ్డి, మున్సిపల్​ చైర్ పర్సన్ వన్నెల్ దేవి లావణ్య అయ్యప్ప శ్రీనివాస్, టౌన్​ కాంగ్రెస్​ ప్రెసిడెంట్​ సాయిబాబాగౌడ్   అంత్యక్రియలకు హాజరై బాధిత కుటుంబానికి సంతాపం తెలిపారు.