
ప్రముఖ పాత్రికేయుడు వాసుదేవ దీక్షితులు శుక్రవారం కన్నుమూశారు. దీక్షితులు గతంలో ఆంధ్రప్రభ దినపత్రిక ఎడిటర్ గా పని చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. 1967లో ఆంధ్రప్రభ దినపత్రికలో జర్నలిస్ట్ కెరీర్ ప్రారంభించిన దీక్షితులు పలు హోదాల్లో పనిచేశారు. పత్రికా రంగంలో విశ్లేషకులు, సునిశిత విమర్శకుడిగా ఆయనకు మంచిపేరు ఉంది. దీక్షితులు మృతికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు పలువురు ప్రముఖులు, జర్నలిస్టులు సంతాపం తెలిపారు.