ఖైరతాబాద్, వెలుగు: పాత్రికేయ వృత్తికి వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి మానికొండ చలపతిరావు అని పలువురు సీనియర్ జర్నలిస్టులు కొనియాడారు. ఆయనపై సీనియర్ జర్నలిస్టు ఆకుల అమరయ్య రాసిన పుస్తక పరిచయ కార్యక్రమం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం జరిగింది. జర్నలిస్టు కొండయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి అతిథులుగా సీనియర్ జర్నలిస్టులు వినయ్‌కుమార్, వల్లీశ్వర్, పాశం యాదగిరి, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేణుగోపాల్‌నాయుడు హాజరై మాట్లాడారు.
జర్నలిజంలో ధ్రువతార చలపతిరావు అని కొనియాడారు. పద్మభూషణ్‌అవార్డును సైతం ఆయన తిరస్కరించారన్నారు. చలపతిరావుకు చెందిన వివరాల కోసం ఎన్నో చోట్ల ఆరా తీశామని పుస్తక రచయిత అమరయ్య పేర్కొన్నారు. మిర్యాల వెంకటరావు ఫౌండేషన్‌ద్వారా ఈ పుస్తకాన్ని ప్రజల ముందుకు తీసుకుస్తున్నట్లు చెప్పారు.