ఛీ.. ఛీ ఏంటి ఈ చెండాలం.. మహిళను లైంగికంగా వేధించిన పోలీస్ అధికారి.. నెట్టింట వీడియో

ఛీ.. ఛీ ఏంటి ఈ చెండాలం.. మహిళను లైంగికంగా వేధించిన పోలీస్ అధికారి.. నెట్టింట వీడియో

ఫిర్యాదు చేయడానికి వచ్చిన ఓ మహిళ పట్ల ఉన్నతస్థాయి పోలీస్ అధికారి ఒకరు అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెను ఓ గదిలోకి తీసుకెళ్లి ఒంటిపై చేతులేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. ఆ దృశ్యాలను బయట వ్యక్తి కిటికీలోంచి రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతగాడి లీలలు బయటకొచ్చాయి. ఈ ఘటన కర్ణాటకలోని తుమకూరు జిల్లాలో వెలుగు చూసింది. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమకూరు జిల్లా పావగడకు చెందిన మహిళ భూ వివాదంపై ఫిర్యాదు చేసేందుకు మధుగిరి  డీఎస్పీ అధికారి రామచంద్రప్ప(58) కార్యాలయానికి వెళ్ళింది. కొద్దిసేపు వినయంగా నటిస్తూ ఆమె సమస్యను శ్రద్ధగా విన్న సదరు పోలీస్ అధికారి.. అంతా తాను చూసుకుంటానంటూ బాధితురాలిని నమ్మించాడు. అనంతరం ఓ గదిలోకి తీసుకెళ్లి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఒంటిపై చేతులేస్తూ నోటితో చెప్పలేని పనులన్నీ చేపించాడు.  

ఆ దృశ్యాలను బయటి వ్యక్తి ఒకరు కిటికీలోంచి రికార్డు చేసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. వీడియోలో సీనియర్ పోలీసు అధికారి మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడం చూడవచ్చు.

వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు డీఎస్పీ అధికారి రామచంద్రప్పను అరెస్టు చేసి సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. ఈ ఘటనను తీవ్రమైన అంశంగా పేర్కొంటూ, మహిళలపై వేధింపులను డిపార్ట్‌మెంట్ సహించదని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. కేసును అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ స్థాయి అధికారి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.