- సెంట్రల్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా కాంపెల్లి
కోల్‌బెల్ట్,వెలుగు: సింగరేణి కోల్‌మైన్స్ లేబర్ యూనియన్(ఐఎన్టీయూసీ)లో కీలకమైన రెండోస్థానం మందమర్రికి చెందిన సీనియర్ కార్మిక నేత కాంపెల్లి సమ్మయ్యను వరించింది. సోమవారం యూనియన్సెక్రటరీ జనరల్ బి.జనక్‌ప్రసాద్ కేంద్ర కమిటీ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న కాంపెల్లి సమ్మయ్యను సెంట్రల్ కమిటీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించారు.
తనపై నమ్మకం ఉంచి యూనియన్‌లో కీలకమైన బాధ్యతలు అప్పగించిన జనక్‌ప్రసాద్, హైకమాండ్ కు కాంపెల్లి కృతజ్ఞతలు తెలిపారు. సమ్మయ్య ప్రస్తుతం మందమర్రి ఏరియా ఎంవీటీసీలో పనిచేస్తున్నారు.