-
సుప్రీంలో లాయర్ హరీశ్ సాల్వే
న్యూఢిల్లీ: దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారాలపై సీనియర్ లాయర్ హరీశ్ సాల్వే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈడీ అధికారాలను తగ్గించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టులో వాదించారు. గురుగ్రామ్‌కు చెందిన రియల్ ఎస్టేట్ కంపెనీ ఎం3ఎం డైరెక్టర్స్ మనీ లాండరింగ్ కేసులో అరెస్టు కాగా, ఈ కేసుకు సంబంధించి ఫైల్ అయిన పిటిషన్లపై జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుంద్రేశ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ తాజాగా విచారణ చేపట్టింది.
ఈ సందర్భంగా నిందితుల తరఫున హరీశ్ సాల్వే వాదనలు వినిపించారు. ‘‘ఈడీ అధికారాలను తగ్గించకపోతే.. దేశంలో ఎవరూ సురక్షితంగా ఉండరు. ఎం3ఎం కంపెనీ డైరెక్టర్లు ఈడీకి సహకరించినప్పటికీ వాళ్లను అరెస్టు చేశారు. ఇది పూర్తిగా హక్కుల ఉల్లంఘనే. ఈడీ దారుణంగా వ్యహరించింది. ఈడీ అధికారాలకు కత్తెర వేయాలి” అని ఆయన అన్నారు.