
హైదరాబాద్, వెలుగు : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఢిల్లీలోని ఆయన నివాసంలో శనివారం మాజీ ఎంపీ, సీనియర్ నేత మధు యాష్కీ భేటీ అయ్యారు. రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది. తెలంగాణలో ప్రభుత్వం..పార్టీ మధ్య సమన్వయం, ఇటీవల రాష్ట్రంలో నిర్వహించిన కుల గణనపై ప్రజల నుంచి వస్తున్న స్పందన వంటి విషయాలపై రాహుల్ కు మధు యాష్కీ వివరించినట్లు సమాచారం.
నేడు రాష్ట్రానికి మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు అల్కా లంబా
జాతీయ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు అల్కా లంబా ఫిబ్రవరి 23న రాష్ట్రానికి వస్తున్నట్టు తెలంగాణ అధ్యక్షురాలు సునీతారావు ఒక ప్రకటనలో తెలిపారు. గాంధీభవన్లో జరుగనున్న రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కార్యవర్గ సమావేశంలో ఆమె పాల్గొననున్నారని అందులో పేర్కొన్నారు.