మంచిర్యాల, వెలుగు: మందమర్రి పట్టణానికి చెందిన సీనియర్ నాయకుడు మల్యాల రాజమల్లు మంగళవారం బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు జి.వివేక్ వెంకటస్వామి సమక్షంలో ఆ పార్టీలో చేరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి అందుగుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వివేక్ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భీమారం మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు జనగామ తిరుపతి.. మండల అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు.
బీజేవైఎం నాయకుడికి పరామర్శ..
ఇటీవల బీఆర్ఎస్ లీడర్ల దాడిలో గాయపడి మంచిర్యాల గవర్నమెంట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీజేవైఎం బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ భూపెల్లి అజయ్‌ను వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. అజయ్‌కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వేలాలకు చెందిన బీజేపీ నాయకుడు మహేశ్‌ను ఇంటికి వెళ్లి పరామర్శించారు. టేకుమట్లకు చెందిన వేణుగోపాల్‌రావుకు రూ.10వేల ఆర్థిక సాయం అందించారు. కార్యక్రమాల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్‌రావు, జిల్లా ప్రధాన కార్యదర్శులు అందుగుల శ్రీనివాస్, మునిమంద రమేశ్, రజినీష్ జైన్, భీమారం మండల అధ్యక్షుడు వేల్పుల శ్రీనివాస్, బెల్లంపల్లి టౌన్ ప్రెసిడెంట్ కోడి రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
జైపూర్(భీమారం): బీజేపీ పార్టీ బలోపేతానికి ప్రతీ కార్యకర్త కృషి చేయాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీ.వివేక్ వెంకట స్వామి అన్నారు.మంగళవారం మండల కేద్రంలోని పార్టీ కార్య కర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో ఎగిరేది బీజేపీ జెండానే అని అన్నారు. అనంతరం పార్టీలో చేరిన పలువురికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లా అధ్యక్షులు వెరబల్లి రఘునాథ్ మాట్లాడుతూ ప్రజల కు ఉపయోగ పడేలా మోడీ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశ పెట్టిందని ప్రజలు పథకాలను వినియోగించుకోవాలని
అన్నారు