ఆదిలాబాద్ లో బీఆర్ఎస్‌, బీజేపీకి బిగ్‌షాక్ .. కాంగ్రెస్ లో చేరిన సీనియర్‌ నేతలు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్‌, బీజేపీల‌కు బిగ్‌షాక్ త‌గిలింది. ఆ పార్టీల‌కు చెందిన సీనియ‌ర్ నేతలు రాజీనామాలు చేసి కాంగ్రెస్ గూటికి చేరారు. ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్  అభ్యర్థి కంది శ్రీ‌నివాసరెడ్డి నేతృత్వంలో డీసీసీబీ మాజీ చైర్మన్ ముడుపు దామోదర్‌రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు పోరెడ్డి కిషన్, సీనియర్ నాయకులు గణపతిరెడ్డి, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ మంచాల పొట్టన్న  టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.

వారకి హ‌స్తం కండువాలు కప్పి  పార్టీలోకి ఆహ్వానించారు.  శ్రీనివాస్ రెడ్డికి త‌న సంపూర్ణ మద్దతిస్తామని వారు తెలిపారు. శ్రీనివాస‌రెడ్డి 50వేల మెజారిటీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన నేతలను రేవంత్‌రెడ్డి అభినందించారు. ఆదిలాబాద్ లో పార్టీ మంచి విజయం సాధించబోతున్నదని, తెలంగాణలో కాంగ్రెస్  అధికారంలోకి రాబోతున్నదన్నారు.