లింగాల, వెలుగు : ఉమ్మడి జిల్లాలో 50 వేలకు పైగా మెజార్టీతో గెలిచిన అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జ్ఞానేశ్వర్ రెడ్డి కోరారు. మంగళవారం లింగాల మండలం కొత్తకుంటపల్లిలో మీడియాతో మాట్లాడుతూ 20 ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ నిస్వార్థంగా సేవలందించారని పేర్కొన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం జడ్పీ చైర్మన్ పదవి ఇస్తామన్నా కాంగ్రెస్ పార్టీలో కొనసాగారని చెప్పారు. వంశీకృష్ణ కు మంత్రి పదవి ఇస్తే మారుమూల ప్రాంతమైన అచ్చంపేట అభివృద్ధి చెందుతుందని తెలిపారు.