
- గోదావరిఖనిలోని సింగరేణి ఆర్జీ -1 ఏరియా జీడీకే 11 ఘనిలో ఘటన
గోదావరిఖని, వెలుగు : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని సింగరేణి ఆర్జీ –1 ఏరియా పరిధిలోని జీడీకే–11 గని పై కప్పు కూలి సీనియర్ మైనింగ్ సర్ధార్ గాయపడ్డాడు. గనిలోని 1వ సీమ్‌లో సీనియర్ మైనింగ్సర్దార్ రవితేజ పనిచేస్తుండగా పైకప్పు కూలడంతో బొగ్గు పెల్ల అతని తలపై పడింది. రవితేజ హెల్మెట్ధరించినా పగిలిపోవడం ప్రమాద తీవ్రతను తెలుపుతుంది. గాయపడ్డ అతడిని గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్‌కు, అనంతరం మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ప్రైవేటు హాస్పిటల్‌కు తరలించారు.
ఘటన శనివారం తెల్లవారుజామున జరగగా, ప్రమాద వివరాలను అధికారులు గోప్యంగా ఉంచడంతో కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూల్స్ కు విరుద్ధంగా రూప్‌నకు హోల్ చేయించడమే ప్రమాదానికి కారణమని తెలుస్తుంది.