టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా అజిత్‌ అగార్కర్‌?

టీమిండియా  కొత్త బౌలింగ్‌ కోచ్‌ గా  మాజీ పేసర్‌ అజిత్‌ అగార్కర్‌ పేరు ఖాయమైందనే వార్తలు వస్తున్నాయి. టీమిండియాలో కీలక సభ్యుడైన ఓ ఆటగాడు  అగార్కర్‌ పేరును బోర్డుకు సూచించినట్లు సమాచారం. వన్డే ప్రపంచకప్‌ –2023 సన్నాహకాల్లో భాగంగా ఈ చర్చ తెరమీదకు వచ్చినట్లు తెలుస్తోంది.  

ప్రస్తుతం భారత మాజీ సీమర్‌ పారస్‌ మాంబ్రే టీమిండియా బౌలింగ్‌ కోచ్‌గా ఉన్నాడు. ఆయన ఇండియా ఏ, అండర్‌ 19 ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో బిజీగా ఉన్నాడు.

44 ఏళ్ల అగార్కర్ టీమిండియా మాజీ బౌలర్‌. ప్రస్తుతం ఆయన టీవీ కామెంటేటర్‌గా ఉన్నాడు. బీసీసీఐ చీఫ్‌ సెలక్టర్‌ పదవికి పోటీ పడగా.. చేతన్‌ శర్మను ఆ పదవి వరించింది. కాగా 1998 నుంచి 2007 వరకు భారత జట్టుకు ప్రాతినిథ్యం వహించిన అగార్కర్‌ 28 టెస్టులు, 191 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. మూడు ఫార్మాట్లలో కలిపి 349 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. 42 మ్యాచ్‌లు ఆడి 29 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

మరిన్ని వార్తల కోసం..

తెలంగాణను మళ్లీ ఏపీలో ఎలా కలుపుతారు?