సీనియర్ ఎన్టీఆర్ ని హీరోగా పరిచయం చేసిన నిర్మాత మృతి..

సీనియర్ ఎన్టీఆర్ ని హీరోగా పరిచయం చేసిన నిర్మాత మృతి..

తెలుగు ప్రముఖ సీనియర్ నటి, నిర్మాత కృష్ణ వేణి ఈరోజు (ఆదివారం 16) కన్ను మూశారు. కొన్నేళ్లుగా వయోభారంతో భాద పడుతున్న కృష్ణవేణి హైదరాబాద్ లోని ఫిలిం నగర్ లో ఉన్న తన నివాసంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు కృష్ణ వేణి కుటుంబ సభ్యులకి ప్రగాఢ సానుభూతని తెలియజేస్తున్నారు.

నటి కృష్ణవేణి సినీ కెరీర్ విషయానికొస్తే మొదటగా 1935లో స్వర్గీయ దర్శకుడు అహీంద్ర చౌదరి దర్శకత్వంలో వచ్చిన మైథలాజికల్ సినిమా "సతీ అనుసయ" అనే సినిమాలో నటించి కేరీర్ ఆరంభించింది. ఈ క్రమంలో డజనుకు పైగా సినిమాలు చేసిన తర్వాత నిర్మాతగా మారింది. 1949 లో ప్రముఖ డైరెక్టర్ ఎల్వీ ప్రసాద్ దర్శకత్వంలో స్వర్గీయ నటుడు, ఏపీ మాజీ సీఎం నందమూరి తారక రామారావుని హీరోగా "మన దేశం" అనే సినిమాతో పరిచయం చేసింది. పెళ్లయిన తరవాత హీరోయిన్ గా నటించడం మానేసి ఫుల్ టైం  నిర్మాతగా మారింది.