ఓయూ రిజిస్ట్రార్​గా ప్రొ.నరేశ్​రెడ్డి

ఓయూ రిజిస్ట్రార్​గా ప్రొ.నరేశ్​రెడ్డి
  •     ఓఎస్డీగా ప్రొ.జితేందర్ నాయక్​

ఓయూ, వెలుగు : ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ కుమార్ పలు పరిపాలనా పదవుల భర్తీకి శ్రీకారం చుట్టారు. ఓయూ నూతన రిజిస్ట్రార్​గా సీనియర్ ప్రొఫెసర్ జి.నరేశ్​రెడ్డి, ఆఫీసర్​ ఆన్ స్పెషల్ డ్యూటీ(ఓఎస్డీ)గా ప్రొఫెసర్ ​జితేందర్​నాయక్​ను నియమించారు. మాజీ రిజిస్ట్రార్​ ప్రొఫెసర్​లక్ష్మీనారాయణ నుంచి నరేశ్​రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అలాగే మాజీ  ఓఎస్డీ ప్రొఫెసర్​రెడ్యానాయక్ ​నుంచి జితేందర్ బాధ్యతలు చేపట్టారు.

ప్రొ.నరేశ్​రెడ్డి ఇప్పటి వరకు టీజీ సెట్ కార్యదర్శిగా, ఓయూ కామర్స్​-బిజినెస్ మేనేజ్​మెంట్ కాలేజీ వైస్​ప్రిన్సిపాల్ గా పనిచేశారు. ప్రొ.జితేందర్ నాయక్​ ఓయూ సైన్స్ కాలేజీ ప్రిన్సిపాల్​గా, జువాలజీ విభాగం హెడ్​గా పనిచేసి ప్రస్తుతం ఓయూ క్యాంపస్​ సైన్స్​కాలేజీ జువాలజీ విభాగంలో సీనియర్ ప్రొఫెసర్​గా విధులు నిర్వహిస్తున్నారు.