
ఏపీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పదుల సంఖ్యలో సీనియర్ విద్యార్థులు.. జూనియర్ విద్యార్థిపై దాడికి దిగారు. అతన్ని ఇష్టమొచ్చినట్లు కొట్టారు. పిడిగుద్దులు కురిపించారు. కాళ్లతో తన్నారు. ఇనుప రాడ్డులతో దాడికి దిగారు. ఆ దృశ్యాలు సినిమా క్లయిమాక్స్‌ను తలపించాయంటే నమ్మాలి. సినిమాల్లో సన్నివేశంలో వంద మంది ఒక్కడిపై దాడి చేసినట్లు దృశ్యాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటన విశాఖపట్నంలోని విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో చోటుచేసుకుంది.
అసలేం జరిగిందంటే..?
విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ‘యువతరంగ్’ ఈవెంట్ నిర్వహించారు. ఈ సంధర్భంగా విద్యార్థులు స్టేజీపై డ్యాన్స్ చేశారు. అలా డ్యాన్స్ చేస్తున్న ఒక జూనియర్ విద్యార్థి కాలు అనుకోకుండా సీనియర్ విద్యార్థికి తగిలింది. అంతే, గొడవ మొదలైంది. తోటి విద్యార్థి క్షమాపణలు చెప్పినా పట్టించుకోని సీనియర్లు.. జూనియర్ విద్యార్థిపై దాడికి దిగారు. అందరి ముందు దారుణంగా కొట్టారు. వైరల్ అవుతోన్న వీడియోలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఒకరిపై దాడి చేస్తున్నారు. వారు బాధితుడిని పదే పదే తన్నడం, నేలపైకి నెట్టడం కనిపిస్తోంది.
విశాఖపట్నం, దువ్వాడ విజ్ఞాన్ ఇంజనీరింగ్ కాలేజీ..
— తెనాలి రామకృష్ణుడు (@vikatakavi369) February 17, 2025
జూనియర్ విద్యార్థిపై సీనియర్, అతని స్నేహితులు దాడి.. పరిస్థితి విషమం#Visakhapatnam #AndhraPradesh #DuvvadaVigyanEngineeringCollege pic.twitter.com/tPjVVeZtMe
గతంలో జరిగిన కొన్ని విషయాలను సీనియర్లు మనసులో పెట్టుకొని ఈ దాడికి పాల్పడ్డారని సమాచారం. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దాడి చేసిన వీడియోలు వైరల్ అవ్వడంతో ఏపీ పోలీసులు అప్రమత్తయ్యారు. హుటాహుటీన కాలేజీకి చేరుకొని.. జరిగిన ఘటనపై వివరాలు ఆరా తీశారు. పలువురు సీనియర్లపై 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
ALSO READ | పెళ్లి ఊరేగింపులో కాల్పులు.. రెండున్నరేళ్ల బాలుడు మృతి