జగిత్యాలలో సెంటిమెంట్ బ్రేక్​అయ్యేనా?

  • సీనియర్ల సహకారానికి కోరుట్ల అభ్యర్థి తండ్లాట
  • డాక్టర్లకిద్దరికీ ఇదే టెన్షన్​

జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లాలో అధికార బీఆర్ఎస్‌‌కు గెలుపు రంది పట్టుకుంది. జగిత్యాల అభ్యర్థికి రెండో టర్మ్​ఫియర్​ ఉండగా, కోరుట్ల అభ్యర్థికి సీనియర్లు సహకరిస్తారో లేదోనన్న టెన్షన్ ​ఉంది. జగిత్యాల నియోజకవర్గంలో రెండోసారి గెలుపు కష్టమనే సెంటిమెంట్​ఉండగా, కోరుట్లలో ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌‌‌రావు కొడుకు సంజయ్‌‌కుమార్‌‌‌‌కు పార్టీ సీనియర్లతో సఖ్యత లేదన్న అభిప్రాయాలున్నాయి. ఈక్రమంలో జిల్లాలో డాక్టర్లకు గెలుపుపై టెన్షన్​పట్టుకుందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 

జగిత్యాలలో సెంటిమెంట్ బ్రేక్​అయ్యేనా?

జగిత్యాల నియోజకవర్గంలో 2004 నుంచి ఇప్పటివరకు వరుసగా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినవారులేరు. 2004లో ఎల్‌‌.రమణపై జీవన్‌‌రెడ్డి గెలుపొందగా, 2009లో ఎల్‌‌.రమణ గెలిచారు. 2014 టీఆర్ఎస్ అభ్యర్థిగా డాక్టర్ సంజయ్ కుమార్ బరిలోకి దిగి 6 వేల తేడాతో ఓడిపోయారు. 2018లో 60 వేల మెజార్టీ తో గెలిచారు. మూడో సారి టికెట్ దక్కించుకున్న సంజయ్‌‌కుమార్.. సెంటిమెంట్‌‌ను బ్రేక్​చేసి ​రెండోసారి గెలుస్తారో లేదోనన్న టెన్షన్​ ఆయన అనుచరుల్లో ఉంది. గతంలో మొదటిసారి ఓడిపోయి రెండో సారి టికెట్ దక్కించుకున్నా గెలిచిన దాఖలాలు లేవని చర్చ నడుస్తోంది . 

కోరుట్లలో సీనియర్ల మద్దతుకు తండ్లాట

కోరుట్లలో 2009 నుంచి టీఆర్ఎస్​అభ్యర్థిగా ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు బరిలో దిగుతూ వచ్చారు. ఒక ఉప ఎన్నికతో కలిపి మొత్తంగా నాలుగు సార్లు పోటీ చేసి గెలిచారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యే తనకు కొడుకు డాక్టర్ సంజయ్‌‌కు టికెట్​ఇప్పించుకునేందుకు ప్రయత్నించి ఫెయిల్​అయ్యారు. కాగా సంజయ్‌‌కు టికెట్​ఇవ్వొద్దని పార్టీ సీనియర్లు, క్యాడర్​ మొత్తుకున్నా హైకమాండ్​ టికెట్​ఇచ్చింది. రాజకీయ అనుభవం లేకపోవడం, సీనియర్​లీడర్లు, క్యాడర్‌‌‌‌తో సత్సంబంధాలు లేకపోవడంతో సంజయ్‌‌కుమార్​ గెలుపుపై టెన్షన్​ నెలకొంది. కాగా తన కొడుకు గెలుపునకు సహకరించాలని ఎమ్మెల్యే విద్యాసాగర్‌‌‌‌రావు సీనియర్లను బుజ్జగిస్తున్నట్లు తెలుస్తోంది.