
- వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌లో ఘటన
శంకర్పల్లి, వెలుగు: తన భార్యతో అసభ్యంగా ప్రవర్తించాడని ఫ్రెండ్‌ను ఓ వ్యక్తి హత్య చేసిన ఘటన వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్‌లో జరిగింది. శనివారం పరిగి డీఎస్పీ కరుణ సాగర్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. దౌల్తాబాద్‌కు చెందిన శేఖర్(32), గోపాల్(31) ఇద్దరూ ఫ్రెండ్స్. వీళ్లు వ్యవసాయం చేస్తున్నారు. గత వారం గోపాల్ ఇంటికి వెళ్లిన శేఖర్.. అతడి భార్యతో అసభ్యకరంగా మాట్లాడాడు. ఈ విషయం గోపాల్‌కు తెలియడంతో శేఖర్‌పై కక్ష పెంచుకున్నాడు. శుక్రవారం రాత్రి శేఖర్‌ను తీసుకొని దౌల్తాబాద్ పట్టణ శివారుకు వెళ్లాడు. అక్కడ ఇద్దరూ కలిసి మsద్యం తాగారు. గోపాల్తన భార్య విషయాన్ని తీసుకురాగా.. వారిద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో గోపాల్ కోపంలో తన చేతిలో ఉన్న బీర్‌బాటిల్‌తో శేఖర్ తలపై కొట్టాడు.
అదే టైమ్‌లో శేఖర్ భార్య అతడికి కాల్ చేసింది. కాల్ లిఫ్ట్ చేసిన శేఖర్ భయపడుతూ.. గోపాల్ పేరును భార్యకు చెప్పాడు. దీంతో వెంటనే అలర్ట్ అయిన గోపాల్.. శేఖర్ మొబైల్‌ను లాక్కుని అతడిని గొంతు నులిమి దారుణంగా హత్య చేశాడు. తర్వాత అక్కడి నుంచి పారిపోయాడు. ఫోన్లో మాటలు విని భయపడిపోయిన శేఖర్ భార్య పోలీసులకు సమాచారం అందించింది. శనివారం ఉదయం శేఖర్ ఆచూకీ కోసం పోలీసులు గాలించారు. తన భర్త చివరలో గోపాల్ పేరును చెప్పాడని శేఖర్ భార్య ఎస్సై రమేశ్‌కుమార్‌కు చెప్పింది. దీంతో గోపాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా నేరం ఒప్పుకున్నాడు. ఆ తర్వాత శేఖర్ డెడ్‌బాడీని పోలీసులు స్వాధీనం చేసుకు న్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.