కేటీఆర్ బామ్మర్దే కొకైన్ ఇచ్చిండు: జన్వాడ ఫామ్‎హౌస్ రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు

కేటీఆర్ బామ్మర్దే కొకైన్ ఇచ్చిండు: జన్వాడ ఫామ్‎హౌస్ రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు

హైదరాబాద్: రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోన్న జన్వాఢ ఫామ్‎హౌస్ రేవ్ పార్టీపై మోకిల పోలీస్ స్టేషన్‎లో కేసు నమోదైంది. ఎస్సై కోటేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోకిలా పోలీసులు కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల, విజయ్ మద్దూర్ ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కాగా, జన్వాఢ ఫామ్‎హౌస్ రేవ్ పార్టీ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్‎లో పోలీసులు కీలక విషయాలు పేర్కొన్నారు. 

మాదకద్రవ్యాలు వాడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు డాగ్ స్క్వాడ్, ఎక్సైజ్, ఎస్ఓటీ పోలీసుల దాడులు చేశారు. శనివారం (అక్టోబర్ 26) రాత్రి 10:30 ఫిర్యాదు అందగా.. 11.30 వరకు పోలీసులు ఫామ్ హౌస్‎కు చేరుకున్నారని తెలిపారు. పార్టీలో మహిళలు, పురుషులు ఇద్దరు ఉన్నట్లు గుర్తించాం. పోలీసులను చూసి మద్యం సేవిస్తున్న వారు కొందరు పరారయ్యేందుకు ప్రయత్నించగా.. వారిని పట్టుకున్నామని వెల్లడించారు. 

Also Read :- నేపాల్ యాత్రకు వెళ్లి.. కరీంనగర్ వాసి గుండెపోటుతో మృతి

మొత్తం 16  మంది మహిళలు, 12 మంది పురుషులు పార్టీలో ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. ఫామ్ హౌస్ యజమాని సెర్చ్ వారెంట్ ఉందా అంటూ ప్రశ్నించాడని పేర్కొన్నారు. ఇదే పార్టీలో ఉన్న విజయ్ మద్దూరికి డ్రగ్ టెస్ట్ నిర్వహించగా రిజల్ట్ పాజిటివ్‎గా వచ్చిందని తెలిపారు.  మహిళలు డ్రగ్ టెస్టుకు నిరాకరించారన్నారు. రాజ్ పాకాల, విజయ్ మద్దూరికి ఐదు సంవత్సరాలుగా పరిచయం ఉందని వెల్లడించారు.

దీపావళి పండుగ చేసుకుందామంటూ పలువురిని రాజ్ పాకాల ఫామ్ హౌస్‎కు ఆహ్వానించాడని పోలీసులు పేర్కొన్నారు. ప్రస్తుతం విజయ్  మద్దూరిని పోలీసులు విచారిస్తున్నారు. దర్యాప్తులో విజయ్ సంచలన విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. కేటీఆర్ బామ్మర్ది రాజ్ పాకాల వద్ద నుండే కొకైన్ తీసుకొని తాను సేవించినట్లు విజయ్ మద్దూరి మోకిలా స్టేట్మెంట్ ఇచ్చినట్లు పోలీసులు పేర్కొన్నారు.