ఆన్ లైన్ లో పబ్జీ గేమ్ ఆడుతూ ఇండియా కుర్రాడితో ప్రేమలో పడిన సీమా హైదర్ గురించి పెద్దగా చెప్పక్కర్లేదు. సీమా హైదరీ తన పిల్లలతోపాటు అక్రమంగా ఇండియా వచ్చి సచిన్ మీనాని రెండవ పెళ్లి చేసుకుంది. ఆమెపై మొదటి భర్త గులాం హైదరీ కేసు వేశాడు. దీంతో ఈ టాపిక్ ఎప్పుడు వార్తల్లో నిలుస్తోంది. తాజాగా గులాం హైదరీ తరపు న్యాయవాది సీమా గురించి సంచలన విషయాలు ఆరోపించాడు. ఆమె తరుచూ పాకిస్థాన్ ఆర్మీ ట్రెనింగ్ బేస్ కు వెళ్లి వచ్చేదని అక్కడ ఆమె మేన మామ గులాం అక్బర్ ట్రైనర్ అని ఈ విషయాలన్ని ఆమె సన్నిహితులే తనకు చెప్పారని న్యాయవాది తెలిపారు.
సీమా రెండు సార్లు ఇండియాకు వచ్చిందని, ఆమెకు కంప్యూటర్ కూడా వాడటం వచ్చని గులాం హైదరీ న్యాయవాది చెప్పుకొచ్చాడు. సిమాకు అసలు పబ్జీ గురించే తెలియదని ఆమె స్నేహితురాలు చెప్పిందన్నారు. సీమా హైదర్ కొన్ని ఆడియో రికార్డులు కూడా తన దగ్గర ఉన్నట్లు అడ్వకేట్ మోమిమ్ మాలిక్ అన్నారు. ఈ విషయాలన్ని ఓ పాకిస్థాన్ ఇన్ఫార్మర్ నుంచి రాబట్టినట్లు ఆయన చెప్పారు. దైనిక్ భాస్కర్ అనే నివేదికలో అన్ని విషయాలు పొందుపరిచినట్లు ఆయన తెలిపారు.